తెలంగాణలో ‘ఏఈవో’ ఫోస్టుల భర్తీ

తెలంగాణలోని నిరుద్యోగులకి గుడ్ న్యూస్. ఖాళీగా ఉన్న వ్యవసాయ విస్తరణాధికారులు గ్రేడ్‌-2 (ఏఈవో)పోస్టుల నియామక ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 194 ఏఈవో గ్రేడ్‌-2 పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఈ మేరకు పొరుగుసేవల విధానంలో పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడుతున్నట్లు వ్యవసాయ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఏఈవో పోస్టుల భర్తీకి అనుమతించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ధన్యవాదాలు తెలిజయజేశారు. త్వరలోనే నియామక ప్రక్రియని చేపట్టనున్నారు.