తెలంగాణలో ఆకలి చావులు

లాక్‌డౌన్‌ వల్ల ప్రైవేటు డ్రైవర్ల కుటుంబాలు ఆదాయం లేక ఆకలి తీరక అలమటిస్తున్నాయని, వారికి రూ.15,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించేలా చూడాలంటూ న్యాయవాది రాపోలు భాస్కర్‌ హైకోర్టులో మే 23న ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశార. దీనిపై హైకోర్టులో వాదనలు జరిగాయి.

లాక్‌డౌన్‌ సమయంలో రేషన్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ తెలంగాణ ప్రభుత్వం 12 కిలోల బియ్యం, రూ. 1500 చొప్పున నగదు అందజేసిందని, కార్డు లేనివారికి ప్రధానమంత్రి యోజన కింద ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం ఇస్తుందని, అంతకంటే ఎక్కువ అవసరపడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. లబ్ధి పొందినవారిలో ప్రైవేటు డ్రైవర్లు కూడా ఉండవచ్చని పేర్కొంది. డ్రైవర్లకు సాయం అందించడమనేది ప్రభుత్వ విధాన నిర్ణయమని, అందులో జోక్యం చేసుకోలేమంది.