అబ్దుల్ కలామ్ గా అలీ ..

ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీ లలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది. సినీ , రాజకీయ , క్రీడా, బిజినెస్ రంగాలకు సంబందించిన వ్యక్తుల తాలూకా జీవిత కథలను బయోపిక్ రూపంలో సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ జీవిత కథతో ఒక సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో ప్రముఖ కమెడియన్ అలీ కలాంగా నటిస్తున్నారు. ఈ నేపధ్యంలో విడుదలకి రెడీ అవుతున్న ఈ చిత్ర పోస్టర్ ను విడుదల చేశారు. జగదీష్ దానేటీ ఈ బయోపిక్ ను డైరెక్ట్ చేస్తుండగా..జాన్ మార్టిన్ నిర్మాణంలో ఈ మూవీ టాలీవుడ్, హాలీవుడ్ లలో తెరకెక్కబోతుంది.

ఫస్ట్ లుక్ విడుదల కార్య క్రమానికి కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జవదేకర్ మాట్లాడుతూ ఎందరివో బయోపిక్ లు వచ్చాయి. ఇప్పుడు అబ్దుల్ కలాం పై సినిమా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలీ మాట్లాడుతూ.. గత 40ఏళ్లుగా తాను కలాం అభిమానినని అన్నారు. ఆయన పాత్రలో నటించడంఅదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.