రాజమౌళి ఇంకా పెంచబోతున్నాడట..

బాహుబలి తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్ , చరణ్ లు హీరోలుగా నటిస్తుండగా చరణ్ సరసం బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ‘ఒలివియా మోరిస్’ నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలో అలియా సన్నివేశాల్లో మార్పులు చేస్తున్నాడట రాజమౌళి.

సినిమాలో అలియా పాత్ర నిడివిని ఇంకా పెంచాలని .. ప్రేక్షకులకు ఆసక్తి కలిగించే కొన్ని ప్రేమ సన్నివేశాలను జోడించాలని రాజమౌళి డిసైడ్ అయ్యాడట. మొదట అనుకున్న స్క్రిప్ట్ ప్రకారం అయితే సినిమాలో ఆలియా భట్ సీన్స్ తక్కువే ఉన్నాయట. అందుకే ఆమె సీన్స్ పెంచుతున్నట్లు సమాచారం. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తుండగా.. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.