కరోనా రోగులు నేరుగా మంత్రికే ఫోన్ చేయండి !

కరోనా రోగులకి ఏపీ మంత్రి ఆళ్లనాని తన ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఏమైనా సమస్యలుంటే.. నేరుగా తనకే ఫోన్ చేయమని చెప్పారు. ఏలూరు కలెక్టర్‌ ఆఫీసు నుంచి ఆళ్ల నాని వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వీడియో మాధ్యమం ద్వారానే కొవిడ్‌ ఆస్ప్రతుల్లోని రోగులతో మాట్లాడారు.

కొవిడ్‌ ఆస్పత్రుల్లో భోజనం నాణ్యత సరిగా లేదని, దుప్పట్లు ఇవ్వట్లేదని, మరుగుదొడ్లు శుభ్రం చేయట్లేదని ఈ సందర్భంగా మంత్రికి రోగులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి ఆళ్ల నాని వారి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి సమస్య ఉన్నా 1800 233 1077 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Spread the love