అమర్ సింగ్ కన్నుమూత

రాజ్యసభ సభ్యుడు, సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత అమర్‌సింగ్‌ ఇక లేరు. సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. మూత్రపిండాల మార్పిడి చేయించుకున్న అమర్‌సింగ్‌.. గత ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో శనివారం మధ్యాహ్నం ఐసీయూలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.

అమర్‌సింగ్‌ 1996లో తొలిసారి యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2003 జూన్‌లో, తాజాగా 2016లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన అనేక పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు. అయితే, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో 2010లో అమర్‌సింగ్‌, సినీనటి జయప్రదను సమాజ్‌వాదీ పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే.