అంబులెన్స్‌ చార్జీలపై సుప్రీం కీలక తీర్పు

కరోనా రోగులని ఆసుపత్రులకు తరలించే అంబులెన్స్‌లకు విపరీతంగా చార్జీలు వసూలు చేస్తున్నారంటూ ఎర్త్‌ అనే సంస్థ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అంబులెన్స్‌ చార్జీలను రాష్ట్రప్రభుత్వాలు నిర్ధారించాలని స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల్లో అంబులెన్స్‌ చార్జీల ప్రస్తావన లేదనీ, అందుకే ఆసుపత్రులు విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని పిటిషన్‌ దారుడు కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. కొన్ని రాష్ట్రాలు ఈ మార్గదర్శకాలను పాటించడం లేదని రోగుల నుంచి 7000 నుంచి 50,000 వరకు అంబులెన్స్‌ చార్జీలు వసూలు చేస్తున్నారని కోర్టు దృష్టికి వచ్చినట్టు ధర్మాసనం పేర్కొంది.