అమెజాన్‌ ప్రైమ్‌ యూజర్ల సూపర్‌ ఆఫర్‌

తన వినియోగదారులకు అమెజాన్ ప్రైమ్ వీడియో మరో బంపర్‌ ఆఫర్‌ తీసుకొచ్చింది. మొబైల్-ఓన్లీ ప్లాన్‌ను ప్రకటించింది. ప్రైమ్ వీడియో కంటెంట్ కోసం 89 రూపాయల ప్లాన్‌నుంచి ప్రారంభయ్యేలా ప్లాన్లను తీసుకొచ్చింది. ఓవ‌ర్ ద టాప్ ప్లాట్‌ఫామ్స్ మ‌ధ్య పోటీ తీవ్ర మవుతున్న నేపథ్యంలో ఈ కొత్త స్ట్రాటజీతో యూజర్లను ఆకర్షించనుంది.

ఓటీటీలో టాప్ ప్లేస్‌లో ఉన్న‌ నెట్‌ఫ్లిక్స్‌కు ఎదుర్కొనేలా సరికొత్త వ్యూహాలతో దూసుకొస్తోంది. నెట్‌ఫ్లిక్స్ తన మొబైల్ ప్లాన్‌ను నెలకు రూ. 199 ధరతో విడుదల చేసిన తర్వాత వీటిని లాంచ్‌ చేయడం గమనార్హం. ఎయిర్‌టెల్‌ భాగస్వామ్యంతోఈ కొత్త ప్లాన్‌ను అమెజాన్ లాంచ్ చేసింది. ఇందులో భాగంగా ప్రీపెయిడ్ ఎయిర్‌టెల్ వినియోగదారులకు తొలి 30 రోజులు ఉచితంగా ట్ర‌య‌ల్ చేయ‌వ‌చ్చు. ఆ త‌ర్వాత 28 రోజుల‌కు రూ.89 వ‌సూలు చేస్తారు. ప్రైమ్ వీడియో సేవలు మొబైల్‌లోఅందుబాటులోఉంటాయి.

Spread the love