అమూల్ కు అమితాబ్ కృతజ్ఝతలు

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన ఆసుపత్రి నుంచి కోలుకున్నారు. అమితాబ్ కంటే ముందే ఆయన కోడలు ఐశ్వర్యారాయ్, మనవరాలు ఆరాధ్యలు కూడా కరోనా నుంచి కోలుకున్నారు. బిగ్ బీ కరోనాతో పోరాడి గెలిచిన సందర్భంగా డెయిరీ బ్రాండ్ అమూల్ కొత్త డూడుల్‌ను విడుదల చేసింది. అమితాబ్ చేతిలో మొబైల్ పట్టుకొని సోఫాలో కూర్చున్నట్లు డూడుల్‌లో కనిపిస్తుంది.

అమూల్ బిగ్‌బీ పక్కనే నిలబడి ఉంది. ఈ చిత్రాన్ని ‘ఎబి’ బీట్స్ ‘సి’ అనే ట్యాగ్‌లైన్‌ను జోడించారు. ‘ఎబి’ అంటే అమితాబ్ బచ్చన్‌, ‘సి’ అంటే కరోనా వైరస్‌ను సూచిస్తుందని అర్థం చేసుకోవాలి. ఈ పోస్ట్‌ను బిగ్ బీకి ట్యాగ్ చేయగా అమితాబ్ హావభావంతో హత్తుకున్నారు. ట్విటర్ ద్వారా అమూల్‌కు కృతజ్ఞతలు తెలియచేశారు. “మీ ప్రత్యేకమైన పోస్టర్ ప్రచారంలో నన్ను నిరంతరం ఆలోచించినందుకు అముల్ ధన్యవాదాలు” రాసుకొచ్చారు.