అంధకారంలో ముంబై స్పందించిన బిగ్ బీ

ముంబై మహానగరం చీకటిమయం అయింది. గ్రిడ్ ఫెయిల్యూర్ సమస్య వలన ముంబై అంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రైళ్ళు ఆగిపోయాయి. కార్యాలయాలలో పనులకి బ్రేక్ ఏర్పడింది. నగర ప్రజలు విద్యుత్ సమస్యపై తమ ట్విట్టర్ ద్వారా పోస్ట్‌లు పెడుతున్నారు.

తాజాగా ముంబై బ్లాకౌట్ పై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ వేదికగా స్పదించారు. ముంబై సిటీ మొత్తానికి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. అయినప్పటికీ ఏదో విధంగా ట్వీట్ చేస్తున్నా. ప్రశాంతంగా ఉండండి, పరిస్థితులు మెరుగవుతాయి. డోంగిల్స్ పని చేశాయి.వోడాఫోన్ నా కోసం పని చేస్తుంది అని అమితాబ్ రాసుకొచ్చారు.