రివర్స్‌ స్వింగ్‌లో కింగ్ అండర్ సన్ : సచిన్

ఇంగ్లాండ్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్ రివర్స్ స్వింగ్ రాబట్టడంలో కింగ్ అన్నారు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. తాజాగా విండీస్‌ మాజీ సారథి బ్రయన్‌ లారాతో 100 ఎంబీ మొబైల్ యాప్‌లో మాట్లాడిన లిటిల్‌మాస్టర్‌ రివర్స్‌ స్వింగ్‌ బౌలింగ్‌పై స్పందించాడు.

ఆండర్సన్‌ బౌలింగ్‌ చేసేటప్పుడు బ్యాట్స్‌మన్‌ను తికమక పెడతాడు. బంతిని ఔట్‌స్వింగ్‌ వేస్తున్నట్లు చూపించి తీరా దాన్ని వదిలే సమయానికి దిశను మార్చేస్తాడు. దాంతో చాలా మంది బ్యాట్స్‌మన్‌ అతను బంతిని పట్టుకున్న విధానం గమనించి అప్పటికే ఔట్‌స్వింగ్‌లో బంతి పడితే ఆడడానికి సిద్ధమైపోతారు. కానీ ఆ బంతి బ్యాట్స్‌మన్‌కు దూరంగా వెళ్లి వికెట్‌ సమర్పించుకునేలా చేస్తుంది. అందుకే అతడిని అత్యద్భుతమైన బౌలర్‌గా పరిగణిస్తా. రివర్స్‌ స్వింగ్‌లో అతను అత్యుత్తమ పేసర్‌ అని సచిన్ చెప్పుకొచ్చాడు.

Spread the love