‘పవర్ స్టార్’ నుంచి మరో పోస్టర్

పవర్ స్టార్ టైటిల్ తో రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. అచ్చం పవన్ కల్యాణ్ లా ఉండే ఓ వ్యక్తితే షూటింగ్ ని వేగంగా పూర్తి చేస్తున్నారు. మరోవైపు వరుస పోస్టర్స్ ని రిలీజ్ చేస్తూ తనదైన శైలిల్ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే నాలుగైదు పోస్టర్లు వదిలారు.

తాజాగా పవర్ స్టార్ నుంచి వర్మ పోస్టార్ ని వదిలారు. ‘పవరొమాంటిక్’ పోస్టర్‌ ఇదిగో అంటూ ఆర్జీవీ తన ట్విట్టర్ ఖాతాలో దీన్ని పోస్ట్ చేశారు. ఇప్పుడీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక పవర్ స్టార్ ని తొలి ప్రేమ సినిమా రిలీజైన డేటు జులై 24 ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు వర్మ ప్లాన్ చేస్తున్నారు.

Spread the love