మహాసముద్రంలో మరో హీరోయిన్ ఎవరంటే ?

ఆర్ ఎక్స్100 అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న రెండో చిత్రం మహాసముద్రం.శర్వానంద్‌, సిద్ధార్థ్‌ హీరోలుగా నటిస్తోన్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్‌ నటిస్తున్నారు. ఇప్పటికే అదితిరావు హైదరి హీరోయిన్‌గా నటిస్తుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజాగా.. మరో హీరోయిన్‌గా అనుఇమ్మాన్యుయేల్‌ నటిస్తుందని దర్శక నిర్మాతలు తెలిపారు. వైజాగ్‌ నేపథ్యంలో సాగే క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రమిదసి సమాచారం. డిసెంబర్‌ నుండి రెగ్యులర్‌ షూటింగ్ స్టార్ట్‌ అవుతుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.