అనురాగ్’కు ఆ టెస్ట్ చేయాలట !

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ లైగింక వేధింపుల ఆరోపనలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆయనపై నటి పాయల్ ఘోష్ ఫిర్యాదు చేశారు. తనని లైంగింక వేధించాడని మానవహక్కుల సంఘానిక్, పోలీసులకి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. అనురాగ్ ని విచారించారు. పోలీసుల ముందు హాజరైన అనురాగ్ ఆ సమయంలో తాను శ్రీలంకలో వున్నానని, లాంటప్పుడు తాను ఎలా పాయల్‌తో అసభ్యంగా ప్రవర్తిస్తానని వెల్లడించాడు.

దీనిపై పాయల్ ఘాటుగా స్పందించింది. కశ్యప్ పోలీసుల ముందు అబద్ధం చెప్పారని, నార్కో అనాలసిస్‌, లై డిటెక్టర్ అండ్ పాలిగ్రాఫ్ టెస్ట్ కోసం నా లాయర్ దరఖాస్తు చేస్తున్నారని ఆ తరువాత పోలీసులే అనురాగ్ నుంచి నిజమేంటో రాబడతారని నరేంద్ర మోదీ, అమిత్ షాలకు ట్యాగ్ చేస్తూ సంచలన ట్వీట్ చేసింది. దీంతో అనురాగ్‌కు లై డిటెక్టర్ టెస్టులు తప్పవనే వాదన వినిపిస్తోంది.