అనుష్కని వదిలేసిన కోహ్లీ

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు ఆనందంగా ఉన్నారు. హాయిగా సంసారం చేసుకుంటున్నారు. మరీ అనుష్కని కోహ్లీ వదిలేయడం ఏంటీ  అనుకుంటున్నారా.. ? ఓ సమయంలో జరిగిన ఆసక్తికర ఘటన ఇది. శనివారం కోహ్లీతో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌చాట్‌లో మాట్లాడిన ఛెత్రి.. కోహ్లీ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

ఈ సందర్భంగా గతేడాది భూటాన్‌ పర్యటనకు వెళ్లినప్పుడు సైక్లింగ్‌ చేస్తూ కోహ్లీ, అనుష్కను వదిలేసి వెళ్లిపోయాడని చెప్పాడు. దీనికి విరాట్ వివరణ ఇచ్చారు. ‘తామిద్దరం సైక్లింగ్‌ చేస్తుండగా అనుష్క తన వెనక ఉందని, అదే సమయంలో ఎవరో అభిమాని తనని గుర్తుపట్టడంతో అనుష్కను వదిలేసి అక్కడి నుంచి ముందుకెళ్లానని చెప్పాడు. కొద్దిదూరం దూరం వెళ్లాక ఆమె కనిపించకపోవడంతో మళ్లీ వెనక్కి తిరిగెళ్లానని కోహ్లీ చెప్పుకొచ్చాడు.