సుజానా మాటలతో.. పార్టీకి సంబంధం లేదట !

ఏపీ రాజధాని అమరావతి విషయంలో భాజాపాకు సరైన క్లారిటీ లేదు. భాజాపా అధిష్టానం మాత్రం ఏపీ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం ఉందని మాట్లాడతారు. రాష్ట్ర నేతల్లో కొందరు మాత్రం రాజధాని విషయంలో సరైన సమయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని చెబుతున్నారు. ఎంపీ సుజనా మొదటి నుంచి ఇదే చెబుతున్నారు.

తాజాగా ఆయన వ్యాఖ్యలని ఏపీ భాజాపా ఖండించింది. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆ పార్టీ తెలిపింది. అయితే, రాజధాని ఎక్కడ పెట్టాలనే అంశం మాత్రం కేంద్రం పరిధిలో లేదని తెలిపింది. రాజధాని కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందన్న సుజనాచౌదరి వ్యాఖ్యలను ఏపీ భాజపా ఖండించింది. పార్టీ వైఖరికి భిన్నంగా సుజనా చౌదరి మాట్లాడారని ట్వీట్‌ చేసింది.