హైదరాబాద్’కు ఏపీ బస్సులు.. జగన్ ఆదేశం !

ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ కూడా బస్సులు నడపాలని ఆదేశించారు. తెలంగాణకు బస్సుల రవాణా అంశాన్ని సీఎం వైయస్ జగన్ దృష్టికి మంత్రులు పేర్ని నాని, బొత్స సత్యనారాయణ తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన సీఎం వైయస్ జగన్‌..బస్సులు తిప్పేందుకు అవసరం అయితే న్యాయ సలహా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సగం సీట్లు మాత్రమే నింపి బస్సులు నడపాలని సీఎం సూచించారు. ఆర్టీసీ బస్సులో సీటుకు సీటుకు మధ్య ఒక సీటు వదిలి వేయాలని ఖచ్చితంగా ప్రయాణీకుల మధ్య భౌతిక దూరం పాటించాల్సిందేనని జగన్ ఆదేశించారు. అలాగే బస్సుల్లో ప్రయాణించే వారికి మాస్కు తప్పనిసరి చేయాలన్నారు. బస్టాండ్‌లో దిగగానే స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు.