రైతులకు నగదు బదిలీ బిల్లుకు ఏపీ కేబినేట్ ఆమోదం

సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినేట్ సమావేశం జరుగుతోంది. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడంతోపాటు రైతులకు నగదు బదిలీ విధానంలో బిల్లులు చెల్లించాలనే ప్రతిపాదనలకు ఏపీ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. పథకం అమలుకు పైలట్‌ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాను ఖరారు చేసింది.

త్వరలోనే పంపుసెట్లకు విద్యుత్‌ మీటర్లు బిగించేందుకు ఆమోదం తెలిపింది. డిసెంబర్‌లోగా జిల్లాలో పంపుసెట్లకు డిస్కంలు మీటర్లు బిగించనున్నాయి. రాయలసీమ ప్రాజెక్టుపై ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. అలాగే ప్రకాశం బ్యారేజీ కింద రెండు బ్యేరేజీల ప్రతిపాదనలను ఆమోదించింది.