ఈ నెల 15న ఏపీ కేబినేట్ భేటీ

ఈ నెల 15న ఏపీ కేబినేట్ భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయం బ్లాక్‌లో మంత్రివర్గం భేటీ కానుంది. పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది. చర్చించే అంశాల ప్రతిపాదనలను సిద్ధం చేయాలని విభాగాధిపతులకు సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఏపీ కేబినేట్ ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకుంటుందా ? అన్నది ఆసక్తిగా మారింది. ఇసుక, సంక్షేమ పథకాల అమలుపై కేబినేట్ భేటీలో చర్చించే ఛాన్స్ ఉంది.