ప్రగతి భవన్ లో సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ అధికార నివాసం ప్రగతిభవన్ కి చేరుకొన్నారు. కొద్దిసేపట్లో వీరిద్దరు భేటీ కానున్నారు. అంతకంటే ముందు లంచ్ చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భోజనం చేసిన తర్వాత సమావేశమై తాజా రాజకీయ పరిణామాలతో పాటు నదుల అనుసంధానం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చించనున్నట్లు తెలిసింది.

విభజన సమస్యలు, పెండింగ్‌లో ఉన్న పలు విషయాలపై వారు చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏపీలో మూడు రాజధానుల అంశం వారిద్దరి మధ్య చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలే లక్ష్యంగా పలు అంశాలపై చర్చించనున్నారు. గతంలోనూ తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశమైన సంగతి తెలిసిందే. వాటికి కొనసాగింపుగానే తాజా భేటీ జరుగుతోంది.