ఏపీలో వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ కనెక్షన్ల మీటర్లు ఏర్పాటు చేయాలనీ నిర్ణయం తీసుకుంది. విద్యుత్ ఉచిత సబ్సిడీని నగదు రూపంలో రైతుల ఖాతాలకు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. వినియోగం మేరకు వచ్చిన బిల్లులు రైతులే డిస్కంలకు చెల్లించేలా మార్గదర్శకాలు రూపొందించింది.

ఈ నిర్ణయంతో ప్రభుత్వం నుంచి ఎంత సాయం అందుతుందో రైతులకు స్పష్టమవుతోంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం సమగ్ర భూ సర్వేకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దాదాపు రెండేళ్లు టార్గెట్ పెట్టుకొని భూ సమస్యలని పరిష్కరించనుంది. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ని త్వరలోనే విడుదల చేయనున్నారు.