ఏపీ కరోనా రిపోర్ట్

ఏపీలో గడిచిన 24 గంటల్లో 7,956 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,75,079కి చేరింది. 24 గంటల వ్యవధిలో 60 మంది మృతిచెందారు. దీంతో మృతిచెందిన వారి సంఖ్య 4,972కి చేరింది.

ప్రస్తుతం 93,204 యాక్టివ్‌ కేసులున్నాయి. గత 24 గంటల్లో 9,764 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 46,61,355 నమూనాలను పరీక్షించినట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా మృతి చెందిన వారిలో చిత్తూరు జిల్లాలో 9 మంది, అనంతపురం 7, కర్నూలు 5, ప్రకాశం 5, విశాఖపట్నం 5, తూర్పుగోదావరి 4, కడప 4, కృష్ణా 4, శ్రీకాకుళం 4, విజయనగరం 4, పశ్చిమగోదావరి 4, నెల్లూరు 3, గుంటూరులో ఇద్దరు మరణించారు.