ఏపీలో 3,892 కొత్త కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల్లో 3,892 కరోనా కేసులు నమోదయ్యాయ్. దీంతో రాష్ట్రంలో నమోదైన కొవిడ్‌ కేసుల సంఖ్య 7,67,465కి చేరింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కరోనాతో చికిత్స పొందుతూ 28 మంది మృతిచెందారు. 24 గంటల వ్యవధిలో 5,050 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోగా 41,669 యాక్టివ్‌ కేసులున్నాయి.

చిత్తూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో నలుగురు చొప్పున.. తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురేసి మరణించారు. అనంతపురం, శ్రీకాకుళంలో ఇద్దరు చొప్పున మృతిచెందగా.. కర్నూలు, విజయనగరం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,319కి చేరింది.