ఏపీలో 3,746 కొత్త కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల్లో ఏపీలో 3,746 కొత్త కేసులు నమోదయ్యాయి. 27 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,93,299కు చేరింది. తాజాగా ప్రాణాలు కోల్పోయినవారితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 6,508 మంది బాధితులు కొవిడ్‌కు బలయ్యారు.

గడిచిన 24 గంటల్లో 7,739 మంది కోలుకోవడంతో రాష్ట్రంలో పూర్తిగా కోలుకున్నవారి సంఖ్య 7,54,415కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 32,376 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న మృతి చెందినవారిలో కృష్ణా జిల్లాలో ఐదుగురు కరోనాతో మృతి చెందగా.. అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. కడప, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లా్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు.