ఏపీలో.. 24 గంటల్లో 10,548 కేసులు.. 82 మరణాలు !

ఏపీలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 10,548 కొత్త కేసులు నమోదమయ్యాయ్. మరో 82 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా కేసుల సంఖ్య 4,14,164కి చేంది. మరణాల సంఖ్య 3,796కి చేరింది.

గత 24 గంటల్లో 8,976 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తం 3,12,687 మంది కరోనాను జయించి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 97,681 క్రియాశీల కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌లో వెల్లడించింది.