ఏపీలో 10.392 కొత్త కేసులు

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 10,392 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయ్. 72 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,55,531కి కరోనా కేసులు చేరాయిం. మరణాల సంఖ్య 4,125కి చేరాయి.

ప్రస్తుతం ఏపీలో 1,03,076 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి 3,48,330 మంది రికవరీ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 38.43 లక్షల కరోనా టెస్టులు నిర్వహించారు. కొత్తగా నెల్లూరు 11, చిత్తూరు 10, పశ్చిమగోదావరి జిల్లాలో 9, ప్రకాశం 8 మంది మృతి చెందారు. కృష్ణా 6, విశాఖ 6, విజయనగరం 3, కడప 2, కర్నూలులో ఒకరు మృతి చెందారు. అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళంలో నలుగురు చొప్పున మృతి చెందారు.