ఏపీ కరోనా రిపోర్ట్ : 9,536 కేసులు.. 10,131 మంది డిశ్చార్జ్‌

ఏపీలో గడిచిన 24గంటల్లో 9,536 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,67,123కు చేరింది. కొత్తగా 66మంది మరణించగా మొత్తం మరణాల సంఖ్య 4,912కి చేరింది. ప్రస్తుతం 95,072 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

మరోవైపు రికవరీ అవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 10,131 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,67,139కి చేరినట్టు వైద్యారోగ్యశాఖ ఆదివారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది.