ఏపీలో మరో 10వేల కేసులు

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24గంటల్లో 9,999 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,47,686కి చేరింది. వీరిలో 4,46,716మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 4779 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 96,191 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

కొత్తగా నమోదైనవాటిలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1499 కేసులు రాగా.. పశ్చిమగోదావరిలో 1081, చిత్తూరు జిల్లాలో 1040 చొప్పున కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో తొమ్మిది మంది మృతి చెందగా.. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎనిమిది మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అలాగే, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఏడుగురు చొప్పున, అనంతపురం, విశాఖ జిల్లాలో ఆరుగురు చొప్పున, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున, తూర్పుగోదావరిలో నలుగురు, శ్రీకాకుళంలో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ఒకరు కరోనాతో మరణించారు.