ఏపీలో 793 కొత్త కేసులు.. 11మంది మృతి !

ఏపీలో రోజువారీగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.  గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 793 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 13,891కి చేరింది.

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కరోనాతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కర్నూలు జిల్లాలో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, విజయనగరం జిల్లాలో ఒకరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు ఉన్నారు.

ఇక కొత్తగా నమోదైన కేసుల్లో రాష్ట్రానికి చెందిన వారు 706 మంది ఉండగా.. ఇతర రాష్ట్రాల్లోని వారు 81 మంది, ఇతర దేశాల్లోని వారు ఆరుగురు ఉన్నారు.