డిగ్రీ, పీజీ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

కరోనా ప్రభావంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు పదో తరగతి పరీక్షలని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఇక డిగ్రీ, పీజీ పరీక్షలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఏపీలో డిగ్రీ, పీజీ పరీక్షల రద్దుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.

కేంద్ర గైడ్‌లైన్స్ ప్రకారంగానే తుది నిర్ణయం ఉంటుందన్న ఆయన.. పరీక్షలు నిర్వహణ, సాధ్యాసాధ్యాలపై యూనివర్సిటీల వైస్ ఛాన్స్‌లర్లు, ఉన్నతాధికారులతో చర్చించి వారి నుంచి కీలక సూచనలను తీసుకున్నామని తెలిపారు. రెండు లేదా మూడు రోజుల్లో ఎగ్జామ్స్ నిర్వహణ విషయంపై వర్సిటీల వైస్ ఛాన్స్‌లర్లతో సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాతే డిగ్రీ, పీజీ పరీక్షలపై తుది నిర్ణయం వెలువడనుందని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.