సహజ వాయువుపై పన్ను పెంచిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం ఐదు రకాల పెట్రోలియం ఉత్పత్తులపై విలువ ఆధారిత పన్నును వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముడి చమురుపై 5 శాతం, పెట్రోలుపై 31 శాతంతో పాటు అదనంగా 4 రూపాయల మేర పన్ను వసూలు చేస్తుండగా.. డీజిల్‌పై 22.5 శాతంతో పాటు అదనంగా 4 రూపాయల మేర వ్యాట్‌ను రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తోంది.

ఇక ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్‌పై 1 శాతం వాణిజ్య పన్నుల శాఖ వ్యాట్ వసూలు చేస్తోంది. తాజాగా రాష్ట్రంలో సహజ వాయువుపై వ్యాట్ చట్టం ప్రకారం పన్ను పెంచింది. ఇప్పటివరకు 14.5 శాతంగా ఉన్న ఆధారిత పన్నును 24.5 శాతానికి పెంచుతూ వాణిజ్య పన్నుల శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.