ప్రభుత్వం చర్చకు రావాలంటూ రైతులకి ఆహ్వానం

ఏపీ రాజధాని అమరావతి రైతులు గత 25 రోజులుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రైతులతో చర్చలకు సిద్ధమని ఏపీ మంత్రి కొడాలి నాని ప్రకటించారు. ఆందోళన చేస్తోన్న రైతాంగాన్ని చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దని నాని కోరారు. భూముల రేట్లు పడిపోతాయేమోనని ఆందోళన రైతుల్లో ఉందని, దాన్ని ఎలా పరిష్కరించాలనేదానిపై చర్చిండానికి తాము సిద్ధమన్నారు.

జీఎన్ రావు, బీసీజీ కమిటీలు ఏపీకి మూడు రాజధానులు ఉండాలని చెబుతున్నాయి. ఆ కమిటీల సూచనల ప్రకారమే ప్రభుత్వం చేస్తోంది. కొన్ని పార్టీలు చేస్తున్న ఆందోళనలకు మాత్రం తలొగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే.. రైతులు, ప్రభుత్వంతో చర్చించేందుకు సిద్ధమైతే.. తాము కూడా చర్చలకు రెడీ అని నాని పేర్కొన్నారు. ఇక ఈ నెల 18న సమావేశం కానున్న ఏపీ కేబినేట్ లో రాజధానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకొన్నారు. ఆ తర్వాత ఈ నెల 20వ తేదీ ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది. రాజధాని అంశంపై చర్చించనుంది.