వైసీపీ, తెదేపా, భాజాపాలకు హైకోర్ట్ నోటీసులు

రాజధాని అమరావతి తరలింపు కేసులో హైకోర్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని వ్యవహారంలో రైతులు, కూలీలు, సామాజిక కార్యకర్తలు, సామాన్యులు వేసిన 72 పిటిషన్స్ ని ఏపీ హైకోర్ట్ విచారణకు స్వీకరించింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారంలో ఉన్నప్పుడు మరోలా మాట మారుస్తున్నారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. సీఎంతోపాటు మంత్రివర్గం, రాజకీయపార్టీలపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి, మంత్రులు, టీడీపీ, బీజేపీలకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.  ఏపీ రాజధాని విషయంలో రాజకీయ పార్టీలు తలో స్టాండ్ మీద ఉన్న సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీల వైఖరితో రాజధాని అమరావతి రైతులు గందరగోళానికి గురవుతున్నారు. తాజాగా ఏపీ హైకోర్ట్ ఇచ్చిన నోటీసులతో రాజధానిపై ఏ పార్టీ స్టాండ్ ఏంటన్నది స్పష్టం కానుంది.