ఏపీ హైకోర్టు రిజిస్టార్ కన్నుమూత

ఆంధప్రదేశ్‌ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజశేఖర్‌ మృతి చెందారు. ఆయన గుండెపోటుతో మృతి చెందినట్టు సమాచారం. హైకోర్టులో విధులు నిర్వహిస్తున్న ఆయనకు సడన్ గా గుండె పోటు వచ్చింది. దీంతో ఆయనను హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో హైకోర్టులో విషాద చాయలు అలుముకున్నాయని చెప్పాలి. ప్రస్తుతం ఆయన ఇన్ చార్జ్ రిజిస్ట్రార్ జనరల్ గా ఉన్నారు. కొత్తగా మంగళవారమే మహిళా అధికారిని రిజిస్ట్రార్ జనరల్ గా ఛార్జీ తీసుకున్నారు.