తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలని కేంద్రానికి ఏపీ లేఖ 

తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల లొల్లి మరింతగా ముదిరిలావుంది. తాజాగా కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని కేంద్ర నీటిపారుదల శాఖకు ఏపీ సాగునీటి సంఘాల సమాఖ్య లేఖ రాసింది. శ్రీశైలం, నాగర్జున సాగర్‌ డ్యామ్‌లకు ఎగువన తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను ఆపి చట్ట ప్రకారం దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ రైతుల హక్కులను కాపాడాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ను కోరారు. కేఆర్‌ఎంబీ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి తగిన ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

సీడబ్ల్యూసీ, కేంద్ర జలవనరుల శాఖ అపెక్స్‌ కౌన్సిల్‌, కృష్ణానది యాజమాన్య బోర్డు నుంచి అనుమతులు లేకుండా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల 90 టీఎంసీలు, దిండి 30 టీఎంసీలు, మిషన్‌ భగీరథ 20 టీఎంసీలు, భక్త రామదాసు 6 టీఎంసీలు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలను నిలిపివేయాలని లేఖలో పేర్కొన్నారు.