నా సంతకాన్ని ఫోర్జరీ చేశారు డీజీపీకి ఏపీ మంత్రి ఫిర్యాదు

ఏపీ మంత్రి వనిత తన సంతకం ఫోర్జరీకి గురైందని డీజీపీకి ఫిర్యాదు చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసినవారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి వనిత ఫిర్యాదు చేశారు. తన లెటర్‌ ప్యాడ్‌పై కడప జిల్లా టీడీపీ నేత ఫోర్జరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అసైన్డ్‌ భూమి కేటాయించాలని కలెక్టర్‌కు లేఖ ఇచ్చి దొరికిపోయారని, వెంటనే టీడీపీ నేతపై చర్యలు తీసుకోవాలని మంత్రి వనిత ఫిర్యాదులో పేర్కొన్నారు.

కడపజిల్లాకి చెందిన టీడీపీకి నేత… మంత్రి సరిత లెటర్ ప్యాడ్ పై తనకి అసైన్డ్‌ భూమి కేటాయించాలని కలెక్టర్‌కు లేఖ అందజేశాడు. అనుమానం వచ్చిన కలెక్టర్ మంత్రి వనితకి ఫోను చేసి ఆరా తీశారు. ఈ న్యూస్ తో షాక్ గురైన మంత్రి వనిత.. తాను ఎవరికి భూములు కేటాయించమని లెటర్ ప్యాడ్ ఇవ్వలేదని.. తన సంతకాన్ని ఫోర్జరీ చేసినవారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి వనిత ఫిర్యాదు చేశారు.