ఏపీ సెట్ నోటీఫికేషన్ విడుదల

ఏపీ సెట్ నోటీఫికేషన్ విడుదలైంది. ప్రొఫెసర్లు, లెక్చరర్ల అర్హత కోసం నిర్వహించే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీసెట్) నోటిఫికేషన్‌-2020ని ఆంధ్ర యూనివర్సిటీ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ఆగస్టు 14న నుంచి ధరఖాస్తులు తీసుకుంటామని, సెప్టెంబర్ 19 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసోవచ్చని తెలిపింది. ధరఖాస్తులు అధికారిక వెబ్‌సైట్ andhrauniversity.edu.in , apset.net.in లో అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. పీజీలోని సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాల్సిటుంది. ఈ ఏడాది పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు రాస్తున్నవారు రెండేండ్లలో సర్టిఫికెట్లను సమర్పించాల్సిటుందని యునివర్సిటీ ప్రకటనలో ఈ వివరాలను వెల్లడిచారు.