తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ చర్చలు విఫలం

ఏపీ, తెలంగాణ మధ్య బస్సులు ఎవరు ఎన్ని నడపాలి అనే అంశంపై గత రెండు నెలలుగా చర్చలు సాగుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీల సమావేశం అసంపూర్తిగానే ముగిసింది. రెండు రాష్ట్రాల మధ్య బస్సులు నడిపే విషయమై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎటుతేల్చకుండానే ఎవరిదారిన వారు వెళ్లిపోయారు.

ఏపీ, తెలంగాణ మధ్య బస్సులు నడిపే అంశంపై కిలోమీటర్ల ప్రాతిపదికన నడపాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తే.. అలా కాదు… రూట్ వైజ్ ప్రాతిపదికన నడపాలంటూ తెలంగాణ అధికారులు ప్రతిపాదించారు. అలాగైతే మాకు సాధ్యం కాదని ఏపీ ఆర్టీసీ ఆధికారులు ఖండించగా, ఇలాగైతే మాకు కూడా సాధ్యం కాదంటూ తెలంగాణ ఆర్టీసీ అధికారులు సమర్థించుకున్నారు. దీంతో చర్చలు అసంపూర్తిగా ముగిసిపోయాయ్.