కేసీఆర్’ని సపోర్ట్ చేసిన అసద్

తెలంగాణ సచివాలయ భవనాలను కూల్చివేస్తున్న క్రమంలో దెబ్బతిన్న ఆలయం, మసీదులను ప్రభుత్వ ఖర్చులతో మళ్లీ నిర్మిస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ స్పందించారు. సీఎం కేసీఆర్ ప్రకటనని స్వాగతిస్తున్నాం అన్నారు.

మరోవైపు సచివాలయ భవనాల కూల్చివేత పనులు సోమవారం వరకు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కూల్చివేత పనులు నిలిపివేయాలని కోరుతూ పి.ఎల్‌.విశ్వేశ్వరరావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Spread the love