గ్రేటర్ ప్రచారం : అసదుద్దీన్‌ ఒవైసీకి నిరసన సెగ

ఎన్నికల ప్రచారంతో గ్రేటర్ హైదరాబాద్ హీటెక్కింది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యాయ్. అయితే జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి నిరస సెగ తగిలింది.

జాంబాగ్‌ డివిజన్‌ ఎంఐఎం అభ్యర్థికి మద్దతుగా ఒవైసీ సోమవారం ఉదయం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టకాలంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఎన్నికల సమయంలో ఎలా ఓట్లు అడుగుతారని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వరద సహాయం తమకు అందలేదని ఒవైసీని మహిళలు నిలదీశారు. దీంతో వారికి సమాధానం చెప్పకుండానే ఒవైసీ అక్కడి నుంచి వెనుదిరిగారు.

Spread the love