‘అశ్వథ్థామ’ అదరగొట్టింది


ఇప్పటివరకూ లవర్‌బాయ్‌, పక్కింటి కుర్రాడిగా ప్రేక్షకులను అలరించిన నాగశౌర్య ఇప్పుడు యాక్షన్‌ సన్నివేశాలతో అదరగొడుతున్నాడు. ఆయన కథానాయకుడిగా రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అశ్వథ్థామ’. మెహరీన్‌ కథానాయిక. ఐరా క్రియేషన్స్ నిర్మించింది. జనవరి 31న ప్రేక్షకుల ముందుకొచ్చిన అశ్వద్థామ సూపర్ హిట్ అయింది.అశ్వద్థామ వెండితెర పైనే కాదు బుల్లితెర పైన కూడా ఘన విజయం సాధించింది.

ఈ సినిమా శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న జెమినీ బుల్లి తెరపై ప్రసారం చేయగా భారీ టి ఆర్ పి సొంతం చేసుకుంది అశ్వథ్థామ . తాజాగా విడుదల చేసిన రిపోర్ట్స్ ప్రకారం అశ్వథామ సినిమా 9.10 టి ఆర్ పి దక్కించుకుంది. వెండితెర, బుల్లితెరపై కూడా నాగశౌర్య సినిమాల్లో అశ్వద్థామ బెస్ట్ సినిమా అనిపించుకుంది.