రాజధాని రైతులకి నిర్మాత మద్దతు

ఏపీలో రాజధాని రగడ కొనసాగుతోంది. అమరావతి రైతులు దాదాపు నెలరోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని అంశంపై సినీ ప్రముఖులు స్పందించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా సినీ స్టార్స్ ఇళ్ల ఎదుట నిరసన చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం సూపర్ స్టార్ మహేష్ బాబు మరికొందరి ఇళ్ల ముందట నిరసన దీక్ష చేశారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాత అశ్వినీదత్ రాజధాని రైతులని కలిసి మద్దతు తెలిపారు.

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ ఆందోళన చేస్తున్న అమరావతి రైతులకు సినీ నిర్మాత అశ్వనీదత్‌ మద్దతు ప్రకటించారు. మందడంలో దీక్ష చేస్తున్న రైతులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను అశ్వీనదత్‌కు వివరించారు. రాజధాని రైతుల ఆందోళనలు 25వ రోజుకు చేరిన విషయం తెలిసిందే. అశ్వినీదత్ దారిలోనే మరికొందరు రాజధాని రైతులకి మద్దతు ప్రకటించబోతున్నట్టు సమాచారమ్.