జనసేనలోకి అశ్వినీదత్ ?

ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా ? ఆయన జనసేనలో చేరుతారా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈరోజు అశ్వినీదత్ అమరాతి వెళ్లారు. అక్కడ రైతులతో ముచ్చటించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, అశ్వినీదత్ మంత్రి బొత్సపై షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజధానిని విశాఖకు తరలిస్తామని మంత్రి చెబుతున్నారని, ఆయన భాషే మనకు సరిగా అర్థం కాదని ఎద్దేవా చేశారు. బొత్స చెప్పేది ఆయన ఇంట్లోవాళ్లకు కూడా అర్థం కాదని అన్నారు.

ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడుతున్నారని… రాజధాని అంశం ఆయనకు ఏదో బొమ్మలాటలా ఉన్నట్టుందని దుయ్యబట్టారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెడీ అంటే రూ. 100 కోట్లు పెట్టుబడి పెట్టి సినిమా తీసేందుకు ఎందరో నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని అశ్వినీదత్ అన్నారు. కానీ అవన్నీ వదులుకుని ఆయన ప్రజాజీవితంలోకి వచ్చేశారని చెప్పారు. అమరావతి రైతులకు అండగా ఆరేళ్ల నుంచి నిలబడ్డారని కొనియాడారు. అశ్వినీదత్ మాటలని బట్టీ ఆయన జనసేనకి ఫేవర్ గా కనిపిస్తున్నారు.