అసోం వరదలు.. 109 మంది మృతి !

అస్సోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయ్. ఇప్పటివరకు ఈ వరదల ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 109కి చేరింది. రాష్ట్రంలోని 22 జిల్లాల పరిధిలో దాదాపు 12లక్షల మంది ప్రజలు వరద ప్రభావానికి గురైనట్టు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ అధికారులు వెల్లడించారు.

ఈ వరద ప్రభావానికి 26 జిల్లాల్లో 187 వంతెనలు, కల్వర్టులతో పాటు 30 జిల్లాల్లోని 1937 రహదారులు సైతం ధ్వంసమయ్యాయి. మరోవైపు, కజిరంగ జాతీయ పార్కు,లో నీటిస్థాయి తగ్గిందనీ.. ప్రస్తుతం 60శాతం మేర ఇంకా వరద ముంపులోనే ఉందని అధికారులు తెలిపారు. 1364 గ్రామాలు వరద ముంపునకు గురికాగా.. 82,947 హెక్టార్లలోని పంట నీట మునిగింది. బాధితుల కోసం 137 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయగా.. వీటిలో 26,161 నిర్వాసితులు ఆశ్రయం పొందుతున్నారు.