అస్సాంలో సంపూర్ణ లాక్‌డౌన్

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి లాక్‌డౌన్ ని ఆశ్రయిస్తున్నాయి. తాజాగా అస్సాం ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్ విధించింది. అస్సాంలో నేటి అర్థరాత్రి నుంచి 14 రోజుల పాటు కొనసాగనుంది. దీంతో అక్కడి ప్రజలు నిత్యావసరాలు, పండ్లు, కూరగాయలు ముందుగానే కొనుగోలు చేస్తున్నారు.

లాక్‌డౌన్‌తో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ప్రభుత్వం యోచిస్తోంది. అస్సాంలో ఇప్పటి వరకు 7165 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో4815 మంది డిశ్చార్జి కాగా 2093 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 10 మంది మృతి చెందినట్లు తెలిసింది.

Spread the love