ఏపీలో మరో విగ్రహం ధ్వంసం

ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల పలుదేవాలయాల్లో జరిగిన దాడులతో ఏపీ రాజకీయాలు హీటెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో సరస్వతీ దేవి విగ్రహం ధ్వంసమైంది.

శృంగేరి మఠం సమీపంలోని ఓ కాలేజీలో ఉన్న సరస్వతీ దేవి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విగ్రహంపై మద్యం పోసి.. బాటిళ్లతో దుండగులు కొట్టి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది.