అయోధ్య రామజన్మ స్థలంలో బయటపడిన దేవతా విగ్రహాలు

అయోధ్య వివాదానికి సుప్రీం కోర్టు పరిష్కారం చూపిన సంగతి తెలిసిందే. అయోధ్య రామజన్మభూమి స్థలాన్ని హిందువులకు అప్పగిస్తూ 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయోధ్యలో మరో చోట మసీదు నిర్మాణానికి 5 ఎకరాల భూమి సున్ని సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో త్వరలోనే అయోధ్యలో మందిరాన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయోధ్య రామజన్మభూమి స్థలం చదును చేస్తుండగా దేవతా విగ్రహాలు బయటపడ్డాయి. పుష్ప కలశం, ఐదడుగుల శివలింగం, విరిగిన దేవతా విగ్రహాలు, ఏడు నల్లరాతి స్థంభాలు, ఆరు ఎర్రరాతి స్థంభాలు లభించాయి. గతంలో జరిగిన తవ్వకాల్లోనూ ఇలాంటి ఆధారాలు బయటపడిన సంగతి తెలిసిందే.