తెలుగు రాష్ట్రాల్లోనూ రాబోయేది భాజాపా ప్రభుత్వమే !

తెలుగు రాష్ట్రాల్లో భాజాపా బలపడుతుందన్న సంకేతాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే సాధారణ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భాజాపా అధికారంలోనికి వస్తుందని ఆ పార్టీ నేత బాబు మోహన్ అన్నరు. సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని వీఐపీ ప్రారంభదర్శనం సమయంలో బాబూమోహన్‌ దర్శించుకున్నారు.

అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ… భాజపాలోకి నాయకుల చేరికలు పెరిగాయన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపానే అధికారంలోకి వస్తుందన్నారు.

Spread the love