ఏపీలోని మందు బాబులకు బ్యాడ్ న్యూస్

ఏపీలోని మందు బాబులకి బ్యాడ్ న్యూస్. ఐదు రోజుల పాటు ఏపీలో మద్యం షాపులు బంద్ కానున్నాయ్. ఏపీలో ఇటీవలే పంచాయతీ ఎన్నికలు ముగియగా.. మార్చి 10వ తేదీ నుంచి మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్నాయి.

దీంతో ముందు జాగ్రత్త చర్యగా.. మార్చి 10 వ తేదీన ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో 48 గంటల ముందే మద్యం దుకాణాలు బంద్ కాబోతున్నాయి. ఓట్ల లెక్కింపుకు 24 గంటల ముందు కూడా మద్యం అమ్మకాలు ఉండవు. అంటే..మార్చి 13, 14 తేదీల్లో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రెటరీ (CS) ఆదిత్యనాథ్ దాస్.. సోమవారం జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

Spread the love