అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు

ఏపీ ఈఎస్ఐ స్కామ్ లో మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత అచ్చెన్నాయుడుకి షరతులతో బెయిల్ మంజూరైంది. కోర్టు అనుమతి లేకుండా దేశాన్ని విడిచి వెళ్లకూడదని అచ్చెన్నకు హైకోర్టు షరతు విధించింది.

అరెస్టైన తర్వాత చేసిన హెల్త్ చెకప్ లో అచ్చెన్నాయుడుకి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయిన సంగతి తెలిసిందే. గత 70 రోజులుగా ఆయన రిమాండ్ లో ఉంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈఎస్ఐ స్కామ్ లో దాదాపు రూ. 150కోట్ల అవినీతి జరిగినట్టు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.